మహేష్ బీగాలని అభినందించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్!
యూరప్ పర్యటన వివరాలని వివరించిన మహేష్ బీగాల!
ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల ఎన్నారైలతో జరిగిన జూమ్ సమావేశం విశేషాలను ప్రగతీ భవన్ లో ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బీగాల వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్ కి వివరించారు. సమావేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ప్రజల అవసరాలే ఎజెండాగా జాతీయ రాజకీయాల్లో కేసిఆర్ కీలక పాత్ర పోషించే దిశాగా అడుగులు వేయాలని చేసిన తీర్మానాన్ని ప్రపంచ వ్యాప్తంగా వున్న ఎన్నారైలు అందరూ ముక్తకంటంతో కెసిఆర్ గారి నిర్ణయాన్ని స్వాగతించారని వివరించారు. ఈ సందర్బంగా కేటీర్ గారు మహేష్ బీగాల ప్రపంచ వ్యాప్తంగా వున్న వివిద రాష్టాల వారితో చేసిన కార్యక్రమాన్ని అభినందించారు! అలాగే మహేష్ బీగాల రానున్న రెండు వారాల తన యూరప్ పర్యటనను వివరించారు. యూరప్ లోని వివిద దేశాలలో అన్ని రాష్టాల ప్రతినిదులని కలిసి దేశ ప్రజల అవసరాలే ఎజెండాగా జాతీయ రాజకీయాల్లో కేసిఆర్ గారి పాత్రపై వివరిస్తామని అలాగే దేశ ప్రజల శ్రేయస్సు కోసం కేంద్రంలో కేసీఆర్ నాయకత్వం ఉండాలి అని వివరిస్తామని తెలిపారు.













