విజయాలకు పొంగిపోం.. అపజయాలకు కుంగిపోం
విజయాలకు గర్వపడమని, అపజయాలకు కుంగిపోమని తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు గెలుపొందిన తర్వాత హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ నుంచి మంత్రి కేటీఆర్ మాట్లాడారు. దుబ్బాక ఉప ఎన్క్నికల్లో టీఆర్ఎస్కు ఓటు వేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీని గెలిపించడానికి అహర్నిశలు శ్రమించిన నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. దుబ్బాక ఫలితం మేం ఆశించినవిధంగా ఫలితం రాలేదని చెప్పుకొచ్చారు. ఆరున్నరేళ్లలో టీఆర్ఎస్ ఎన్నో విజయాలు నమోదు చేసుకుందని గుర్తు చేశారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకొని భవిష్యత్‌లో ముందుకుపోతామని కేటీఆర్ సృష్టం చేశారు.













