కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ధరణి కంటే : రేవంత్
ధరణి పోర్టల్ బీఆర్ఎస్కు ఏటీఎంలా మారిందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మరింత మెరుగైన వ్యవస్థను తీసుకొస్తామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. జోగులాంబ గద్వాలజిల్లా అలంపూర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అలంపూర్ కాంగ్రెస్ అభ్యర్థి సంపత్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్, బీజేపీలపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇస్తున్నట్టు నిరూపిస్తే, తాను నామినేషన్ వేయనని సవాల్ విసిరారు. ఆర్డీఎస్ సమస్యను పరిష్కరించే బాధ్యతను సంపత్ కుమార్, తాను తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉచిత విద్యుత్ పథకం తీసుకొచ్చేందే కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. జోగులాంబ ఆలయం అభివృద్ధి గురించి బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.













