ఆధారాలు దొరకాలంటే… ప్రగతిభవన్ లో సోదాలు
లిక్కర్ స్కాంలో కవిత ఉన్నారని బీజేపీ నేతలే చెబుతున్నారని, ఆధారాలు దొరకాలంటే ప్రగతిభవన్‌లో సోదాలు జరగాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ సమగ్రతను కాపాడటం కోసమే భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్నట్టు తెలిపారు. హక్కుల కోసం పోరాడుతున్నామనే తమపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. బ్రిటీష్ కాలం నాటి పరిస్థితులు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయన్నారు. దేశ ప్రజలపై బీజేపీ దాడి చేస్తోందని మండిపడ్డారు. జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సాగుతుందని వెల్లడిరచారు
ప్రగతిభవన్ మాఫియాకు అడ్డాగా మారిందని, పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలు, ఎంపీల ఆర్థిక స్థితిగతులపై సీబీఐతో విచారణ జరిపించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. గతంలో కేజ్రీవాల్‌ను ఢల్లీిలో సీఎం కేసీఆర్ కలిశారని, లిక్కర్ స్కాంకు కర్త, కర్మ, క్రియ కేసీఆర్‌నని ఆరోపించారు. ఆయన్ను సీబీఐ ప్రశ్నించాలన్నారు.













