తెలంగాణ పీసీసీ ఎన్నారై కమిటీ ఏర్పాటు
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరపున అమెరికాలో ఎన్నారై కమిటీలను నియమించినట్లు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, టీపీసీసీ యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా విభాగాన్ని ఏర్పాటు చేస్తూ కార్యవర్గాన్ని నిర్ణయించారని ఎన్ఆర్ఐ సెల్ కోఆర్డినేటర్ మద్దుల గాల్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ పీసీసీ యూఎస్ఏ ఎన్ఆర్ఐ విభాగంలోని కోర్ కమిటీలో తిరుపతిరెడ్డి, అవనూర్ రమేశ్ చంద్ర, వేముగంటి శరత్ చంద్ర, ఎల్మారెడ్డి నరేందర్ రెడ్డి తదితరులతో పాటు ఎగ్జిక్యూటివ్, స్పెషల్ ఇన్వైటీస్, మహిళా కమిటీని నియమించినట్లు ఆయన పేర్కొన్నారు. అడ్వైజరీ, యువజన, మైనార్టీ, సోషల్‌మీడియా, కో ఆర్డినేషన్లకు సంబంధించిన కమిటీలను, యువజన, మైనార్టీ, సోషల్ మీడియా, కో ఆర్డినేషన్ లకు సంబంధించిన కమిటీలను, యూఎస్ఏలోని వివిధ రాష్ట్రాలనకు ఇన్చార్జిలను నిర్ణయించినట్లు గాల్‌రెడ్డి వెల్లడిరచారు.













