కేసిఆర్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు.. నిరంజన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల హడావిడి గట్టిగా కనిపిస్తోంది. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ ఒకరిపై ఒకరు మాటల యుద్ధం సాగిస్తున్నారు. తాజాగా సిరిసిల్లలో ఎండిన పంటలు పరిశీలించడానికి వెళ్లిన కేసీఆర్ రైతులను కాంగ్రెస్ గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో కూడా కాంగ్రెస్ గురించి గట్టిగానే విమర్శించారు. దీంతో కేసిఆర్ పై చర్యలు తీసుకోవాలి అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) ఉపాధ్యక్షుడు బి నిరంజన్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందజేశారు. కేసిఆర్ చేసిన వ్యాఖ్యలు వాడిన భాష ఎన్నికల కోడ్ ని ఉల్లంఘించే విధంగా ఉన్నాయి అని ఆయన పేర్కొన్నారు. వీటికి ఆధారాలుగా కేసీఆర్ మాట్లాడిన మాటలకు సంబంధించి వివిధ పత్రికల్లో వచ్చిన కథనాల పేపర్ క్లిప్పింగులను లేక తో పాటుగా జత చేసి పంపారు.