Youth Congress :యూత్ కాంగ్రెస్ దాడి.. తీవ్రంగా పరిగణించిన టీపీసీసీ

బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నాయకుల (Youth Congress) దాడిని తెలంగాణ పీసీసీ తీవ్రంగా పరిగణించింది. యూత్ కాంగ్రెస్ నేతలను పిలిచి మందలించనున్నట్లు తెలుస్తోంది. యూత్ కాంగ్రెస్ ఇలా ఒక రాజకీయ పార్టీ కార్యాలయంపై దాడికి వెళ్లడం సరైంది కాదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud)అన్నారు. ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) పై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు ఖండిరచాల్సిందేనని, అయితే ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన ఉండాలని అన్నారు. బీజేపీ(BJP) నేతలు కూడా ఇలా దాడులు చేయడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. శాంతిభద్రతల సమస్య ఉత్పన్నం కాకుండా బీజేపీ నాయకులు సహకరించాలని కోరారు.