కేంద్రం, ఈడీ తీరుకు నిరసనగా .. రాజ్‌భవన్ ముందు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఈడీ కార్యాలయంలో అర్థరాత్రి వరకు కూర్చోబెట్టారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం, ఈడీ తీరుకు నిరసనగా రేపు రాజ్‌భవన్ ముందు ధర్నా చేస్తామని తెలిపారు. తాము నిరసన తెలిపితే పోలీసులతో దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. ఖైరతాబాద్ నుంచి రాజ్‌భవన్ వరకు ర్యాలీ ఉంటుందని, రేపటి ర్యాలీకి కాంగ్రెస్ శ్రేణులు తరలి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి కేసీఆర్ పరోక్షంగా సహకరిస్తారని ఆరోపించారు. రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండి బీజేపీ సాయం చేస్తారని పేర్కొన్నారు. కలిసి పనిచేద్దామన్న కేసీఆర్ మమతా బెనర్జీ నిర్వహించిన సమావేశానికి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. బీజేపీకి కేసీఆర్ వ్యతిరేకమైతే రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెడతారా? అని ప్రశ్నించారు.













