మునుగోడు ఉప ఎన్నిక .. తెలంగాణ భవిష్యత్ : రేవంత్
మునుగోడు ఉప ఎన్నిక అనేది తెలంగాణ భవిష్యత్ కాబోతుందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు రేవంత్ వీడియో విడుదల చేశారు. పార్టీ ఫిరాయింపులకు తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ ప్రయోగశాలగా మార్చారని ఆరోపించారు. మునుగోడులో సర్పంచ్, ఎంపీటీసీలను అధికార పార్టీ కొనుగోలు చేస్తోందని ధ్వజమెత్తారు. తాను ఇప్పటికే మునుగోడులో పర్యటించాల్సి ఉన్నా, కొవిడ్ కారణంగా రాలేకపోయానని పేర్కొన్నారు. ఈనెల 20వ తేదీ నుంచి మునుగోడులోనే ఉంటానని వెల్లడించారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ పార్టీ వీడోద్దు. ఎనిమిదేళ్లు కొట్లాడిన నాయకులు, ఒక ఏడాది ఓపిక పడితే కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందన్నారు. టీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాల్సిన సమయమిది. ఇలాంటి సమయంలో పార్టీ మారి చరిత్ర హీనులుగా ఎవరు మిగిలిపోవద్దు అని కార్యకర్తలకు సూచించారు.













