గచ్చిబౌలిలోని టిమ్స్ ప్రారంభం
గచ్చిబౌలి క్రీడా గ్రామంలోని 13 అంతస్తుల భవనంలో 1500 పడకలతో ఏర్పాటు చేసినే టిమ్స్ (తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఆసుపత్రిని సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఎలాంటి హడావుడి లేకుండానే దీన్ని అందుబాటులోకి తెచ్చారు. మంచాలు, వైద్యపరికరాలు సహా ఇతర వసతులు అన్ని వార్డుల్లోనూ కల్పించారు. గ్రౌండ్ ఫ్లోర్లో 50 పడకలతో అధునాతన ఐసీయూను తీర్చిదిద్దారు. తొలుత 10 వెంటిలేటర్లను ఇక్కడ అమర్చారు. ప్రభుత్వ ఆదేశాలతో రెండు, మూడు రోజుల్లో కరోనా బాధితుల తరలింపు పక్రియను చేపడతామని టిమ్స్ నోడల్ అధికారి డాక్టర్ నాగేంద్ర తెలిపారు. ప్రస్తుతం గాంధీలో 1200 పడకలు కరోనా బాధితుల కోసం అందుబాటులో ఉండగా, 600 మంది చికిత్స పొందుతున్నారు. కింగ్‌కోఠి, ప్రకృతి ఆసుపత్రి, సరోజినీదేవి, ఛాతీ ఆసుపత్రుల్లో మరో 600 మందికి చికిత్స అందించే అవకాశం ఉంది. కరోనా రోగుల సంఖ్య మరింతగా పెరిగితే వారికి టిమ్స్ కు తరలిస్తారు.













