కరోనా కాలంలో ప్రజలకు ఉచిత ఐసోలేషన్, ఆక్సిజన్

ప్రస్తుత కరోనా కాలంలో వేలమంది ప్రజలు ఊపిరి తీసుకోవడానికి ఆక్సిజన్ లేక ఊపిరి వదిలేస్తున్నారు. ఐసోలేషన్ గదులు, ఆక్సిజన్ సరఫరా, ఐసీయూ బెడ్లు దొరకడం దుర్లభం అయింది. ఇలాంటి సమయంలో ప్రజలకు ఉచితంగా ఈ సదుపాయాలు అందిస్తే ఎలా ఉంటుంది? ఆ పనే చేస్తోంది హైదరాబాదులోని ప్రాజెక్ట్ ఆశ్రయ. సైబరాబాద్ పోలీస్ (ఎస్‌సీఎస్‌సీ), యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్, హెచ్‌వైఎస్‌ఈఏ నాస్కామ్, ఏఎమ్‌సిహెచ్‌ఎఎమ్, టై హైదరాబాద్, టీఎస్ఐజి కలిసి ఈ ప్రాజెక్టును ప్రారంభించాయి. 100 పడకలతో ఐసోలేషన్ రూమ్స్, ఆక్సిజన్ సపోర్ట్, డాక్టర్ పర్యవేక్షణతో ఈ ప్రాజెక్టు సదుపాయాలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందాలనుకునే పేషెంట్లు ఎస్‌సిఎస్‌సి టెలిమెడిసిన్ హెల్ప్‌లైన్ 040-45811138 నంబరుకు ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటలలోపు కాల్ చేయవచ్చు. ఈ సదుపాయాలు ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ఈ గొప్ప కృషికి సహాయపడాలని అనుకునే వారు https://www.donatekart.com/Project-Ashray/Donate-Essentials లింకు ద్వారా విరాళాలు ఇస్తే మరింత మందికి సేవలు అందించడానికి వీలవుతుందని నిర్వాహకులు కోరారు.