RTC : మూడేళ్లలో హైదరాబాద్ వ్యాప్తంగా.. అనంతరం గ్రామీణ ప్రాంతాల్లోనూ
మహిళలకు ఉచిత బస్సు (Free bus) ప్రయాణం వల్ల ప్రభుత్వం నుంచి ఆర్టీసికి రాబడి పెరుగుతోందని తెలంగాణ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి (Nagireddy) అన్నారు. భద్రాచలం (Bhadrachalam) ఆర్టీసీ డిపోను ఎండీ సందర్శించారు. మొక్కలు నాటిన అనంతరం బస్సులను పరిశీలించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రోజూ 10వేల బస్సుల్లో 60 లక్షల మందిని తరలిస్తున్నట్లు చెప్పారు. వీరిలో దాదాపు 45 లక్షల మంది మహిళలు ఉన్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 250 కోట్లకు పైగా మహిళలు ఉచిత ప్రయాణం చేసినట్లు చెప్పారు. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు రూ.8,500 కోట్లు ఆదా అయ్యింది. రెండేళ్లలో 2,500 కొత్త బస్సులు కొనుగోలు చేశాం. హైదరాబాద్ (Hyderabad) పరిసర ప్రాంతాల్లో 800కు పైగా ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. మూడేళ్లలో హైదరాబాద్ వ్యాప్తంగా అనంతరం గ్రామీణ ప్రాంతాల్లోనూ ఎలక్ట్రిక్ బస్సులు తీసుకువస్తాం అని తెలిపారు.






