యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం

చైత్రశుద్ద పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. శ్రీ లక్ష్మీసమేతుడైన స్వామి వారు తెప్పలో మూడుసార్లు జలవిహారం చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో భాస్కర్‌రావు, చైర్మన్ నరసింహమూర్తి, ప్రధాన అర్చకులు పాల్గొన్నారు.