భారీ వర్షాలతో 5 జిల్లాలకు రెడ్ అలర్ట్
గత మూడు రోజులుగా తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణ తడిసి ముద్దవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు మరికొన్ని రోజులు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇక 9 జిల్లాలకు ఆరెంజ్, మరో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో అధికార యంత్రాంగాన్ని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది.













