తెలంగాణలో మళ్లీ 3 వేలు దాటిన కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. నిన్న రాత్రి 8 గంటల వరకు 1,06,627 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 3037 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో ఎనిమిది మంది మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,788కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 897 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,08,396కి చేరింది. ప్రస్తుతం 27,861 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 18,685 మంది హోం ఐసోలేషన్‍లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో జీహెచ్‍ఎంసీ పరిధిలో 446, మేడ్చల్ మల్కాజిరిగి జిల్లాలో 314, నిజామాబాద్‍లో 279 చొప్పున నమోదయ్యాయి.