తెలంగాణలో కొత్తగా 6,876 కేసులు..

తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. రాష్ట్రంలో కొత్తగా 6,876 కరోనా కేసులు నమోదు అయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజాగా హెల్త్ బులిటెన్‍ను వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 59 మంది మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 2,476కు చేరుకుంది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,63,361కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 79,520 యాక్టివ్ కేసులుండగా, 3,81,365 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‍ఎంసీ పరిధిలో 1,029, నల్గొండ 402, రంగారెడ్డి 387, మేడ్చల్ మల్కాజ్‍గిరి జిల్లాలో 502 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరణాల రేటు 0.53 శాతం ఉండగా, రికవరీ రేటు 82.30 శాతం ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది.