అత్యవసరమైతే తప్ప… ప్రజలు బయటకు వెళ్లొద్దు : కేసీఆర్
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అనవసరంగా రిస్క్ తీసుకోవద్దని, ప్రజలు అత్యవరమైతే తప్ప బయటకు వెళ్లాదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సంబంధిత శాఖల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంతో పాటు తక్షణ చర్యలు చేపట్టాలని సీఎస్ సోమేశ్‌కుమార్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. అన్ని జిల్లా కలెక్టర్లతో సహా సబంధింత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద ముంపు ప్రాంతాల్లో అధికారులను ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ బృందాలను అప్రమత్తం చేయాలన్నారు. జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల నాయకులు, ప్రజాప్రతినిధులు తమ తమ ప్రాంతాల ప్రజల రక్షణ నిమిత్తం అప్రమత్తంగా ఉండాలన్నారు. రక్షణ చర్యల్లో ప్రజలకు సహాయపడాలని, నష్టం జరగకుండా చూసుకోవాలని ప్రజాప్రతినిధులకు సీఎం పిలుపునిచ్చారు.













