న్యూ ఇయర్ వేడుకలపై… తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఏడాది వేడుకలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా నూతన ఏడాది వేడుకలను రాత్రంతా జరుపుకునేలా, మద్యం అందుబాటులో ఉంచుతూ సెలబ్రేషన్లకు సంపూర్ణ అనుమతులు జారీ చేసింది. రాష్ట్రంలో ఇందుకు అనువుగా మద్యం దుకాణాలు, బార్లు, పబ్‌లలో స్పెసల్ ఈవెంట్లను అనుమతులనిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం దుకాణాలను డిసెంబర్ 31న అర్థరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉండేలా ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. బార్లు, ఈవెంట్లు, సెలబ్రేషన్లు, ఇతర వేడుకలకు టూరిజంలో హోటళ్లకు రాత్రి ఒంటిగంట వరకు అనుతులనిస్తూ ఈ ఉత్తర్వుల్లో వెల్లడిరచింది. కాగా ఒమిక్రాన్ నేపథ్యంలో జనవరి 2 వరకు బహిరంగ సమావేశాలు, ప్రజలు గుమిగూడకుండా నియంత్రిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం డిసెంబర్ 31న న్యూ ఇయర్ వేడుకల నిర్వహణకు పలు సడలింపులనిచ్చింది.













