తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం
తెలంగాణ ఇంటర్ ఫలితాలపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిలైన 3 లక్షల 25 వేల మంది విద్యార్థులు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. దీనికోసం సమాచార కేంద్రాల వద్ద, ఇంటర్నెట్ సెంటర్ల దగ్గర లైన్ కట్టాల్సిన అవసరం లేదని చెప్పింది. బోర్డే స్వచ్ఛందంగా ఆ పని చేస్తుందని అధికారులు తెలిపారు. ఫెయిలైన విద్యార్థులకు మే 15లోగా కొత్త మెమోలు జారీ చేస్తామని ప్రకటించింది. ఇప్పటి వరకు కట్టిన డబ్బులను రీఫండ్ చేస్తామని చెప్పింది. ముందు జాగ్రత్తగా ఫెయిలైన సబ్జెక్టులను విద్యార్థులు అడ్వాన్స్ సప్లిమెంటరీకి దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది.













