ఆ అధికారులపై చర్యలు తీసుకోండి : హైకోర్టు
కాంగ్రెస్ వార్ రూమ్ వాలంటీర్ల నిర్బంధంపై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. వాలంటీర్ల నిర్బంధంపై విచారణకు ఆదేశించింది. నిబంధనలకు వ్యతిరేకంగా పోలీసులు విరుద్ధంగా వ్యవహరించారన్న హైకోర్టు అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సీపీని ఆదేశించింది. సీఎం కేసీఆర్, కేటీఆర్, కవిత ఫొటోలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారంటూ గత డిసెంబరులో ముగ్గుర్ని పోలీసులు అరెస్టు చేశారు. వారిని అక్రమంగా నిర్బంధించారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లురవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం తాజాగా తీర్పు వెలువరించింది.













