ఓయూలో రాహుల్ పర్యటనకు.. హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటనకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాహుల్‌ను అనుమతించాలంటూ ఓయూ వీసీని హైకోర్టు ఆదేశించింది. కాగా మే 6న రాహుల్ గాంధీ తెలంగాణ రానున్నారు. షెడ్యూల్ ప్రకారం 6వ తేదీన రాహుల్ హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేయనున్న రైతు సంఘర్షణ సభలో రాహుల్ పాల్గొననున్నారు. మే 7న ఓయూ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. రాహుల్ గాంధీని ఉస్మానియా యూనివర్సిటీకి తీసుకురావాలంటూ విద్యార్థి సంఘాల నేతలు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరడం తెలిసిందే. అందుకు తెలంగాణ పీసీసీ అనుమతించి షెడ్యూల్లో ఓయూ సందర్శనను చేర్చడం, ఈ మేరకు ఓయూ వీసీని అనుమతి కోరడమూ తెలిసిందే.
ఉస్మానియా వర్సటీ వర్గాలు రాహుల్ పర్యటనను నిరాకరించడంతో మొదలైన వివాదం రోజురోజుకూ వేడెక్కుతూ గత ఆరు రోజులుగా కొనసాగుతూనే ఉంది. నిరసనలు, దిష్టిబొమ్మల దహనాలు, అరెస్టులతో ఓయూ ప్రాంగణంలో ఉద్రికత్త నెలకొంది. ఈ విషయమై తెలంగాణ కాంగ్రెస్ హైకోర్టును ఆశ్రయించగా ప్రస్తుతం కోర్టు రాహుల్ ఓయూ పర్యటనకు అనుమతిచ్చింది.













