జనవరి 15 తర్వాత ప్రమాదమే …
ఇతర దేశాల నుంచి వచ్చిన 13 మందికి కరోనా వైరస్ సోకినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డా.జి. శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 13 మంది శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్స్‌కు పంపామన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. దేశంలో ఇప్పటివరకు 5 ఒమ్రైకాన్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఒమైక్రాన్ సోకిన వారిలో తీవ్ర లక్షణాలు కల్పించడం లేదన్నారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ ప్రక్రియ పెరిగిందని తెలిపారు. జనవరి 16 తర్వాత రాష్ట్రంలో కేసులు పెరిగే అవకాశం ఉందన్నారు. ఫిబ్రవరిలో కేసులు భారీగా నమోదయ్యే ప్రమాదం ఉందని తెలిపారు.













