తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
కరోనా ఫోర్త్ వేవ్ ముంచుకొస్తున్న తరుణంలో కొవిడ్ టెస్టులు పెంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ 19 పై హైకోర్టులో విచారణ జరిగింది. కేసులు పెరుగుతుండటంతో పరీక్షలు పెంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కొవిడ్ జాగ్రత్తలు పాటించేలా చూడలని ధర్మాసనం సూచించింది. కోవిడ్‌పై ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. కొవిడ్ బారిన పడి చనిపోయిన వారికి ఎక్స్‌గ్రేషియాపై నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణను జూన్ 22కు వాయిదా వేసింది.













