తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 12న కాదు 13న
తెలంగాణలో దీపావళి సెలవును మారుస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఇచ్చిన ప్రకటన ప్రకారం నవంబర్ 12న దీపావళి సెలవుగా ప్రకటించిన ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో సెలవు తేదీని 13కు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసిది. మార్చిన సెలవు దినాన్ని ప్రభుత్వ ఉద్యోగులు, సంస్థలు, ప్రైవేటు సంస్థలు అమలు చేయాల్సి ఉంటుందని ఉత్తర్వులో పేర్కొంది. ఇక దీపావళి ఈ ఏడాది ఆదివారం రాగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో సైతం దీపావళి సెలవును సోమవారంనకు మార్చిన విషయం తెలిసిందే. ఇక తేదీ మార్పుతో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు రెండో శనివారం (నవంబర్ 11), ఆదివారం (12) సోమవారం (నవంబర్ 13) మూడు రోజులు సెలవులు రానున్నాయి.













