తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు
కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్-7 పై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో థర్మల్ స్క్రీనింగ్ చేయాలని నిర్ణయించారు. తెలంగాణలో ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో 34 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివ్ శాంపిల్స్‌ను అధికారులు జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించింద మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలంటూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది.













