గవర్నర్ పదవికి రాజీనామా చేసి ఎంపీగా ఎంట్రీ ఇవ్వనున్న తమిళిసై..

లోక్ సభ ఎన్నికల వేల పలు రాష్ట్రాలలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ప్రస్తుతం తెలంగాణలో కూడా ఇదే పరిస్థితిని మనం గమనించవచ్చు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు ఆమె త్వరలో ప్రత్యక్ష రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాజ్ భవన్ అధికారిక సమాచారం ప్రకారం తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ గవర్నర్ పదవికి.. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేశారు. ఆమె రాజీనామా పై రాష్ట్రపతి ఆమోదం కూడా తెలిపినట్లు తెలుస్తోంది. జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో తమిళిసై.. తమిళనాడు పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దిగబోతున్నారని.. బీజేపీ తరఫున ఆమె తుత్తుకూడి, చెన్నై సెంట్రల్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారని సమాచారం.