టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలను ఆమోదించిన గవర్నర్
టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి సహా ఐదుగురు సభ్యుల రాజీనామాలను గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. రాజీనామాల ఆమోదానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం తెలపడంతో న్యాయసలహాలు తీసుకున్న అనంతరం గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. గత చైర్మన్, బోర్డు హయాంలో జరిగిన పేపర్ లీకేజీ, ఇతర అవకతవకలపై సమగ్ర విచారణ కొనసాగించాలని ప్రభుత్వానికి సూచించారు. నిరుద్యోగుల జీవితాలతో మరెవరూ భవిష్యత్లో ఆటలాడకుండా బాధ్యుతలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సభ్యుల రాజీనామాల ఆమోదంతో త్వరలో కొత్త కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం పలువురి పేర్లను పరిశీలిస్తోంది. ఇప్పటికే పలు పరీక్షలు పూర్తయినా టీఎస్పీఎస్సీ ఫలితాలు ప్రకటించలేదు. కొత్తగా చైర్మన్, సభ్యుల నియామకం జరిగితే వాటిని వెల్లడిరచే అవకాశముంది.













