15 కిలోల ఉచిత బియ్యాన్ని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణలో కోవిడ్ సాగుతున్న వేళ.. కేసీఆర్ ప్రభుత్వం తన పెద్ద మనసును చాటుకుంది. కోవిడ్ వేళ తిండికి అలమటిస్తున్న పేద ప్రజల కోసం జూన్ నెలకు గాను 15 కిలోల ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. కేంద్రం గుర్తించిన రేషన్ కార్డులకు 15 కిలోలకు తోడు, రాష్ట్రం గుర్తించిన కార్డు దారులకు ఎలాంటి పరిమితి లేకుండా 15 కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇస్తామని ఆయన పేర్కొన్నారు. అంత్యోదయ అన్నయోజన కార్డు దారులకు 35 కిలోలకు అదనంగా మరో 10 కిలోల బియ్యాన్ని, అన్నపూర్ణ కార్డు వారికి 10 కిలోలకు అదనంగా మరో 10 కిలోల బియ్యాన్ని అందిస్తామని మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు.