కేంద్రానికి డెడ్‌లైన్ .. 24 గంటల్లోపు ఓ నిర్ణయం : కేసీఆర్
కేంద్రంపై పోరాటానికి తెలంగాణ ప్రజలు, రైతులు సిద్ధంగా ఉన్నారని, తాడోపేడో తేల్చుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చి చెప్పారు. ఢిల్లీ లోని టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు నిరసన దీక్షలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రానికి 24 గంటల డెడ్‌లైన్ విధించామన్నారు. 24 గంటల్లోపు ధాన్యం సేకరణపై కేంద్రం ఓ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో రైతులు భిక్షగాళ్లు కాదు, ఒకే విధానం లేకపోతే రైతులు రోడ్లపైకి వస్తారని అన్నారు. మోదీ, పీయూష్ గోయల్‌కు రెండు చేతులు జోడిరచి విజ్ఞప్తి చేస్తున్నాను, తెలంగాణ రైతులు పండిరచిన ధాన్యాన్ని కొనాలని కోరుతున్నానని అన్నారు.
తెలంగాణ నుంచి సుమారు 2 వేల కి.మీ. దూరం వచ్చి దీక్ష చేస్తున్నాం. ఇంత దూరం వచ్చి ఆందోళన చేయడానికి కారణమెవరు? నరేంద్ర మోదీ ఎవరితోనైనా పెట్టుకో.. కానీ రైతులతో మాత్రం పెట్టుకోవద్దు. ప్రభుత్వంలో ఎవరూ శాశ్వతంగా ఉండరు. కేంద్రం ధాన్యం కొనాలని దీక్షలో దీక్ష చేస్తున్నాం. దీక్షకు మద్దతిచ్చేందుకు వచ్చినా రాకేశ్ తికాయత్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కేసీఆర్.













