తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
కరోనా పరీక్షల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పరీక్షల ధరను రూ.2,200గా నిర్ణయించింది. వెంటిలేటర్ లేకుండా చికిత్స అందిస్తే రోజుకు రూ.7000, అలాగే వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తే రూ.9000 చెల్లించేలా ధరలను ఖరారు చేసింది. సాధారణ ఐసోలేన్లో రోజుకు ధరను రూ.4500గా నిర్ణయించింది. ఈ మేరకు వైద్యశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆ శాఖ మంత్రి ఈటల రాజేందర్ మీడియా సమావేశం ద్వారా ప్రభుత్వ నిర్ణయాలను వెల్లడించారు. ఐసీఎంఆర్ నిబంధనలకు లోబడే రాష్ట్రంలో పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రైవేట్ ల్యాబ్స్లోనూ కరోనా పరీక్షలకు అనుమతి ఇస్తున్నానని ప్రకటించారు. కరోనా లక్షణాలు ఉన్నవారికి మాత్రమే టెస్టులు చేయాలని అధికారులకు అన్ని ఆస్పత్రులకు ఆదేశాలు ఇచ్చామని మంత్రి ఈటల సృష్టం చేశారు.













