తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ కార్పొరేషన్లు, సంస్థలకు గత ప్రభుత్వ హయాంలో నియమితులైన చైర్పర్సన్లు, వైస్ చెర్పర్సన్ల నియామకాలు, కొందరి పదవీకాలం పొడిగింపును ప్రభుత్వం రద్దు చేసింది. ఈ చైర్మన్లు, వైస్ చైర్మన్లకు వ్యక్తిగత సహాయకులుగా పొరుగుసేవలు, ఒప్పంద ప్రాతిపదికన నియమితులైన సిబ్బందిని తొలగించింది. వీరికి వ్యక్తిగత సహాయకులు, కార్యదర్శులు, ఓఎస్డీలుగా పనిచేస్తున్న ప్రభుత్వ సిబ్బందిని విభాగాలకు బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాగానే పలువురు కార్పొరేషన్ల చైర్మన్లు, తమ పదవులకు రాజీనామా చేశారు. మరికొందరు ఇంకా రాజీనామా చేయకుండా అలాగే పదవుల్లో కొనసాగుతున్నారు. దీంతో వారందరి నియామకాలను ప్రభుత్వం రద్దు చేసింది.













