Cabinet Meeting: 30న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ (cabinet meeting) సమావేశం ఈ నెల 30న జరగనుంది. కొత్త రేషన్‌కార్డు (Ration card) ల జారీ, రైతుభరోసా (Raitu bharosa) , ఇందిరమ్మ ఇళ్ల (indira ma illa) నిర్మాణం తదితర అంశాలపై ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకోవచ్చని తెలుస్తోంది. వచ్చే సంక్రాంతి నుంచి రైతుభరోసా కింద పంటల పెట్టుబడి సాయం సొమ్మును రైతుల ఖాతాలో వేస్తామని ప్రభుత్వం ఇటీవల శాసనసభలో ప్రకటించింది. ఈ పథకానికి అర్హులను గుర్తించడానికి సంబంధించిన విధివిధానాల ఖరారుపై మంత్రివర్గంలో చర్చిస్తారని సమాచారం.