తెలంగాణ కొత్త సచివాలయం 10నెలల్లో పూర్తి…
రాష్ట్రంలో విస్తరిస్తున్న కరోనా వ్యాధి, ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సచివాలయం… వంటి అంశాలపై చర్చించేందుకు తెలంగాణ కేబినెట్ బుధవారం భేటీ అయ్యింది. ఈ సందర్భంగా కొత్త సచివాలయ మాస్టర్ ప్లాన్‌ని, నిర్మాణ డిజైన్లను ఆమోదించారు. అలాగే సచివాలయ నిర్మాణాన్ని 10నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు నిర్దుష్ట గడువును లక్ష్యంగా పెట్టుకోనున్నారు. అలాగే సచివాలయ నిర్మాణంపై జారీ చేయనున్న టెండర్ల ప్రక్రియ పై కూడా మంత్రివర్గ భేటీలో చర్చించారు. బుదవారం రాత్రి పొద్దు పోయేవరకూ ఈ భేటీ కొనసాగింది.













