మాకేం సంబంధం లేదన్న వ్యక్తి.. డిసెంబర్ 3 తర్వాత ఎలా? : కిషన్ రెడ్డి
బీఆర్ఎస్ ప్రభుత్వ అసమర్థత వల్లే తెలంగాణలో ఉద్యోగాల భర్తీ జరగలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేస్తామని మంత్రి కేటీఆర్ ఇప్పుడు అంటున్నారని, ఇన్నాళ్లు అధికారంలో ఉండి ఎందుకు ప్రక్షాళన చేయలేదని ప్రశ్నించారు. నెల క్రితం వరకు టీఎస్పీఎస్సీతో తమకేం సంబంధం లేదన్నారు. మాకేం సంబంధం లేదన్న వ్యక్తి డిసెంబర్ 3 తర్వాత ఎలా ప్రక్షాళన చేస్తారు? కేటీఆర్ పగటి కలలు కనటం మానుకోవాలి. నిరుద్యోగులకు మేలు చేయాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదు. చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికే ఉద్యోగాలు భర్తీ చేసేవారు. ప్రభుత్వ అసమర్థత వల్లే పేపర్లు లీక్ అయ్యి, ఉద్యోగాల భర్తీ జరగలేదు అని ఆరోపించారు.













