మార్చి 27 వరకు అసెంబ్లీ
తెలంగాణ రాష్ట్ర శాసన సభ సమావేశాలు ఈ నెల 27 వరకు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ 15న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 27న ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలుపనుంది. మొత్తం 12 పని దినాలుగా బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ఈ నెల 16, 18, 26 తేదీలను సెలవు దినాలుగా ప్రకటించారు. శాసనసభలో దాడి ఘటనపై మరోమారు భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ మధుసూదనచారి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, మంత్రులు హరీష్రావు, కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వర్రావు, ఈటల రాజేందర్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జానారెడ్డి, భట్టి విక్రమార్క, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, బీజేపీ ఎమ్మెల్యే కిషన్రెడ్డి, సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు.













