ఉత్తమ ఉపాధ్యాయురాలికి మంత్రి సబితా సన్మానం
తెలంగాణ రాష్ట్రం నుంచి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికైన వుమ్మాజి పద్మప్రియను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన కార్యాలయంలో శాలువాతో సన్మానించారు. టీచింగ్ ఎక్స్లెన్సీ అండ్ అఛీవ్మెంట్ కార్యక్రమానికి ఎంపికై అమెరికాలో శిక్షణ పొందిన పద్మప్రియ అక్కడి బోధనా విధానాలను స్థానికంగా అమలు చేసి సత్ఫలితాలు సాధించారని ప్రశంసించారు. కార్యక్రమంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, సాంకేతిక విద్యాశాఖ, ఇంటర్ విద్యాశాఖ కమిషనర్లు నవీన్ మిత్తల్ జలీల్ తదితరులు పాల్గొన్నారు.













