ఈ నెల 12న ప్రవాసీ తెలంగాణ దివస్
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ఈనెల 12న ప్రవాసీ తెలంగాణ దివస్‌ను హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించనున్నట్లు ఆ సంఘం అధ్యక్షులు కవిత చల్లా తెలిపారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ నైపుణ్య శిక్షణ, వ్యవసాయం, నీళ్లు, సాగునీటిపారుదల, ఉద్వానవన రంగాల్లో టీడీఎఫ్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని తెలిపారు. ప్రతి రెండేండ్లకోసారి ప్రవాసీ తెలంగాణ దివస్‌ను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇది దేశంలో నిర్వహిస్తున్న ఆరో కార్యక్రమమని తెలిపారు. టీడీఎఫ్, యూఎస్ఏ ఆధ్వర్యంలో దేశంలో కోవిడ్ నివారణా కార్యక్రమాలు చేపట్టినుట్ల తెలిపారు. ప్రవాసీ తెలంగాణ దివస్ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు టి. హరీశ్‌రావు, ఎస్.నిరంజన్ రెడ్డి, పి.సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, తెలంగాణ జన సమితి అధ్యక్షులు ఎం. కోదండరామ్ తదితరులు హాజరవుతారని తెలిపారు.













