టాంజానియా కాన్సులేట్ కార్యాలయం… ప్రారంభం

తెలంగాణలో సికింద్రాబాద్‍లో కొత్తగా ఏర్పాటు చేసిన టాంజానియా కాన్సులేట్ కార్యాలయాన్ని శీల్ గ్లోబల్ ఇంపాచ్ సీఈవో వర్కటం జగన్నాథ్ రెడ్డి, టాంజానియా హై కమిషనర్ బరాకా హెచ్ లువాండాతో కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‍కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ బరాకా హెచ్ లువాండాను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‍రావు తమ నివాసానికి అల్పాహారానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో టాంజానియా కాన్సులేట్ అధికారి కృష్ణ, విశ్రాంత ఐపీఎస్ అధికారి మల్లయ్య, సీఐడీ విభాగం అధికారి శ్రీనివాసన్, ఆర్గనైజర్ రాజేశ్, సీఐఎస్సీ హైదరాబాద్ సతీశ్ కులకర్ణి, పరీక్షిత్ కాంలే, ప్రమోద్ కాంలే తదితరులు పాల్గొన్నారు.