ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన తానా నాయకులు

సినీనటుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా తానా నాయకులు సునీల్ పంట్ర, లోకేష్ కొణిదెల నివాళులు అర్పించారు. తానా జాయింట్ ట్రెజరర్‌గా ఉన్న సునీల్ పంట్ర, తానా కమ్యూనిటీ సర్వీస్ కో ఆర్డినేటర్‌గా ఉన్న లోకేష్ కొణిదెల తమ హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఎన్టీఆర్ సమాధిని సందర్శించి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు ఎన్టీఆర్ తెలుగు జాతికి, తెలుగు భాషకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.