తానా ఫౌండేషన్ ఆరుణ్య ప్రాజెక్ట్ : మాటూరుపేట, ఖమ్మం జిల్లా
తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామినేని ఫౌండేషన్ దాతృత్వం తో ఖమ్మం జిల్లా మాటూరుపేట గ్రామము నందు డిసెంబర్ 13 వ తారీఖున మొదటి క్యాంపు విజయవంతం గా నిర్వహింపబడినది. దీనిలో 120 మందికి మించి వైద్య పరీక్షలు నిర్వహింపబడినవి. వీరిలో శస్త్రచికిత్స అవసరమైన వారికి ప్రభుత్వపథకాల ద్వారా ఆపరేషన్స్ చేయుబడును.
ఈ క్యాంపు నిర్వహించుటకు తోడ్పడిన శ్రీ సామినేని నాగేశ్వరరావు గారికి (చైర్మన్ – సామినేని ట్రస్ట్), ఫౌండేషన్ ట్రస్టీ సామినేని రవి, డాక్టర్ యార్లగడ్డ సుబ్బారాయుడు, ఆయన సిబ్బందికి, గ్రామ పెద్దలకు, వాలంటీర్స్ కు ధన్యవాదములు. ఈ కార్యక్రమాన్ని రూపొందించిన ఫౌండేషన్ ట్రస్టీ, కోఆర్డినేటర్ ఓరుగంటి శ్రీనివాస్ గారికి ప్రత్యేక అభినందనలు.
ఫౌండేషన్ రూపొందించిన ఈ నూతన ప్రాజెక్ట్ కు అందరూ తమవంతు సహాయం అందించవలసింది గా కోరుకొంటూ..













