వచ్చే ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ తోనే
వచ్చే శాసనసభ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యతిరేక శక్తులను కూడగట్టడమే తన ఐడీయాలజీ అని అన్నారు. బీజేపీ నేతలు స్వామీజీ పేరుతో ఎమ్మెల్యేను కొనేందుకు యత్నించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. తెలంగాణలో మత రాజకీయాలకు తావులేదన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో సీపీఎం బలపరిచిన అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు, తదితర సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందన్నారు.













