Supreme Court: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట

గ్రూప్-1 అంశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గ్రూప్-1 (Group-1) నోటిఫికేషన్ రద్దు కుదరదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. నోటిఫికేషన్ రద్దు, మెయిన్స్ వాయిదా వేయాలని కోరుతూ వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. కొత్త నోటిఫికేషన్ చట్టవిరుద్ధమని కొందరు అభ్యర్థులు గతంలో హైకోర్టు (High Court) లో పిటిషన్ దాఖలు చేశారు. ప్రిలిమ్స్‌లో 14 తప్పులున్నాని పిటిషన్‌లో పేర్కొన్నారు. గ్రూప్-1 మెయిన్స్ వాయిదా వేయాలని హైకోర్టును కోరారు. అభ్యర్థుల పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ అభ్యర్థులు సుప్రీంకోర్టు (Supreme Court) కు వెళ్లారు. పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ నరసింహ నేతృత్వంలోని అభ్యర్థులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. పిటిషనర్లు మెయిన్స్‌కు క్వాలిఫై కానందున మెయిన్స్ పరీక్ష వాయిదా వేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.