తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట… నిమజ్జనానికి రూట్ క్లియర్
హుస్సేన్ సాగర్లో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అడ్డంకులు తొలిగాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. హుస్సేన్ సాగర్ గణేశ్ నిమజ్ఞనానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనానికి ఈ ఏడాదికే మినహాయింపు ఇస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలను హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయకూడదంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై జీహెచ్ఎంసీ కమిషనర్ సుప్రీంకోర్టులో పిటిసన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇక సుప్రీంకోర్టు తీర్పుతో గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి రూట్ క్లియర్ అయింది.













