కరోనా ఎఫెక్ట్ : హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్న జీహెచ్ఎంసీ
హైదరాబాద్ నగరంలో కరోనా పెరుగుతున్న నేపథ్యంలో సర్కార్ అప్రమత్తమైంది. జీహెచ్ఎంసీ పరిధిలో శానిటేజన్ డ్రైవ్ చేపట్టింది. రద్దీ రహదారుల వెంట డీఆర్ఎఫ్ సిబ్బంది హైపోక్లోరైడ్ ద్రావణాన్ని చల్లుతున్నారు. ప్రకృతి విపత్తు సిబ్బంద ప్రత్యేకమైన ట్యాంకర్ల ద్వారా ఈ ద్రావణాన్ని జీహెచ్ఎంసీ పరిధిలో పిచికారీ చేస్తున్నారు. గాల్లో కూడా వైరస్ వ్యాపించే ప్రమాదముందని వైద్యులు హెచ్చరించిన నేపథ్యంలో సర్కార్ ఇలా హైపోక్లోరైడ్ ద్రావణాన్ని చల్లడం ప్రారంభించింది. కొన్ని రోజుల క్రిందటే తెలంగాణ మున్సిపల్ మంత్రి కేటీఆర్ కీలక సూచన చేశారు. తెలంగాణాలోని అన్ని మున్సిపాలిటీల పరిధిల్లో యుద్ధ ప్రాతిపదికన సోడియం హైపోక్లోరైడ్ పిచికారీ చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని పురపాలక సంఘాల పరిధిలో వెంటనే శానిటైషన్ ప్రక్రియ చేట్టాలని కూడా సూచించారు. ఆయా మున్సిపాలిటీలో వాహనాలు తక్కువగా ఉంటే, అద్దెకు తీసుకుని అయినా సరే, ద్రావణాన్ని పిచికారీ చేయాలని అన్నారు.













