పోలీసులను ఆశ్రయించిన సింగర్ మధు ప్రియ … కారణం
హైదరాబాద్ పోలీసులను సింగర్ మధు ప్రియ ఆశ్రయించింది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తనకు పదే పదే బ్లాంక్ కాల్స్ వస్తున్నాయని షీ టీమ్‌కు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది. అంతేగాక సోషల్ మీడియా ద్వారా కూడా తనని వేధిస్తున్నారని, అసభ్యకరమైన సందేశాలు పంపిస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఆమె మెయిల్‌ను షీ టీమ్, సైబర్ క్రైం పోలీసులకు బదిలీ చేసింది. తనకు వస్తున్న బ్లాంక్ కాల్స్ వివరాలను మధు ప్రియ సైబర్ క్రైం పోలీసులకు అందించింది. ఆమె ఫిర్యాదు మేరకు ఐపీసీ 509, 354(బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.













