తెలంగాణ అభివృద్ధి పై… సింగపూర్ కల్చరల్ సొసైటీ ప్రశంసలు
స్వల్ప కాలంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో సాధించిన అభివృద్ధి అత్యద్భుతమని, ఎంతో గర్వకారణమని సింగపూర్ కల్చర్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రశంసించారు. సింగపూర్ పర్యటనలో ఉన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్‌ను సొసైటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. సింగపూర్‌లో నిర్వహించనున్న లష్కర్ బోనాలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా సొసైటీ ప్రతినిధులు మాట్లాడుతూ తెలంగాణ గతంలోనే ఏర్పడి ఉంటే తమ భవిష్యత్ ఎంతో బాగుండేదని అన్నారు. ఉద్యోగం, ఉపాధి కోసం ఇతర దేశాలకు వచ్చేవాళ్లం కాదని వివరించారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్, శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ విదేశాల్లోనూ మన సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగిస్తున్న సొసైటీ ప్రతినిధులను అభినందించారు. లష్కర్ బోనాలకు వచ్చే ఏడాది తెలంగాణ నుంచి కళాకారులను పంపిస్తామని హామీ ఇచ్చారు.













