మహిళల రక్షణలో షీటీమ్స్ బాగుంది
మహిళల రక్షణలో షీటీమ్స్ పనితీరు బాగుందని యూఎస్ కాన్సులేట్ జనరల్ జోయెల్ రీఫ్మాన్ కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్‌కు అనుగుణంగా మహిళల రక్షణ కోసం పోలీస్ శాఖ 24 అక్టోబర్, 2014న షీటీమ్స్‌కు నాంది పలికిన విషయం తెలిసిందే. ఐదు సంంత్సరాల వ్యవధిలోనే 33,700 కేసులను విజయవంతంగా పరిష్కరించింది. ఈ అద్భుత విజయానికి గుర్తుగా నగరంలో చార్మినార్ వద్ద షీటీమ్స్ 5వ వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జోయెల్ రీఫ్మాన్ మాట్లాడుతూ మహిళల రక్షణలో షీటీమ్స్ పనితీరు బాగుందన్నారు. సాంకేతికత వాడకంలో హైదరాబాద్ పోలీసులు ముందున్నారని కొనియాడారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వారికి ఆత్మస్థైర్యాన్ని కల్పిస్తున్నారన్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే ముంతాజ్‌అహ్మద్‌ఖాన్, సీపీ అంజనీకుమార్, క్రైమ్ అదనపు సీపీ శిఖాగోయల్ పాల్గొన్నారు.













