దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా రైల్వే అధికారులు నిరసనకారులను చర్చలకు ఆహ్వానించండంతో ఆందోళనకారులు ఒప్పకున్నారు. అయితే అధికారులే రైల్వే స్టేషన్‌కు రావాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. దీంతో వారి డిమాండ్‌ను అధికారులు తిరస్కరించారు. ఈ నేపథ్యంలో మరోసారి రైల్వేస్టేషన్లో ఉద్రిక్తత నెలకొంది. కాగా ఆందోళనకారులను స్టేషన్ నుంచి తరలించేందుకు అక్కడ అదనపు బలగాలను మోహరించారు. ఇదిలా ఉండగా రైళ్ల రాకపోకలపై దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. రైళ్ల రాకపోకల పునరుద్ధరణకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. విజయవాడ, కాజీపేట నుంచి వచ్చే రైళ్లను మౌలాలీ నుంచి దారి మళ్లించినట్టు స్పష్టం చేశారు. ఈస్‌కోస్ట్, శబరి, ఫలక్నామా, ధనాపూర్, షిర్డీ, ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్టు తెలిపారు.













