హైదరాబాద్లో రేయాన్ సెంటర్
అమెరికాకు చెందిన ట్యాక్స్, సాఫ్ట్వేర్ సేవల సంస్థ ర్యాన్ హైదరాబాద్లో తన రెండో కార్యాలయాన్ని ప్రారంభించింది. ఇందుకోసం సంస్థ గత కొన్నేండ్లుగా మూడు మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టింది. 19 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ భారత్లో వ్యాపార విస్తరణలో భాగంగా నెలకొల్పినట్లు కంపెనీ చైర్మన్, సీఈవో జీ బ్రింట్ ర్యాన్ తెలిపారు. ప్రస్తుతం ఈ సెంటర్లో 60 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా వచ్చే ఏడాదిన్నరలో ఈ సంఖ్యను 200కి పెంచుకోనున్నట్లు ఆయన ప్రకటించారు. మొదటి సెంటర్లో 200 మంది ఉపాధి పొందుతున్నారని, భవిష్యత్తులో ఈ సంఖ్యను రెండింతలు పెంచుకోనున్నట్లు చెప్పారు.
భారత్లో వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించడంలో భాగంగా 2013లో భాగ్యనగరంలో 166 సిబ్బందితో తన తొలి సెంటర్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. 2019 నాటికి 522కి పెంచుకున్న సంస్థ ఈ ఏడాది చివరినాటికి ఈ సంఖ్యను 580కి పెంచుకోనున్నట్లు ప్రకటించింది. గతేడాదికిగాను 600 మిలియన్ డాలర్ల ఆదాయన్ని గడించింది.













