హిందూ ధర్మాన్ని భవిష్యత్ తరాలకు అందించాలి : మోహన్ భగవత్
హిందూ ధర్మాన్ని భవిష్యత్ తరాలకు అందించే బాధ్యత ధర్మాచార్యులు, ధార్మిక సంస్థలపైనే ఉందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భగవత్ అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్లోని శ్రీరామనగరానికి విచ్చేసిన ఆయనకు వేద పండితులు ఘనంగా స్వాగతం పలికారు. అహోబిల జీయర్ స్వామి, దేవనాథ జీయర్ స్వామి పూల మాలలతో సత్కరించారు. ఇక్కడి జీవా ప్రాంగణంలో నిర్వహిస్తున్న ధార్మిక సంస్థలను భాగవత్ సందర్శించారు. వేద విద్యనభ్యసిస్తున్న చిన్నారులతో ముచ్చటించారు. అనంతరం కటీరంలో చినజీయర్ స్వామి ని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.













